
యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ మండలం గూడూరు శివార్లలో చిన్నెటి వాగులో నాచారంకు చెందిన దండు నరేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వాగు దగ్గరకు స్నేహితులతో కలిసి వెళ్లిన నరేష్ నీళ్లలోకి దిగాడు. అతని స్నేహితులు చూస్తుండగానే కళ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోయాడు. గండు నరేష్ s/o కిష్టయ్య. నరేష్ ఒక కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాడని అతని స్నేహితులు తెలిపారు. అతని వయసు 24 సంవత్సరాలు. పెళ్లి అయింది. సొంతూరు నాచారం.
భారీ వర్షాలు కురుస్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించాలనే ఆలోచనలో కొందరు అత్యుత్సాహంతో ఇలా నీళ్లలో దిగి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. గల్లంతయిన నరేష్ ఆచూకీ ఇప్పటికి తెలియలేదు. అతను క్షేమంగా ఉండాలని, ఏ చెట్టు కొమ్మనో.. రాయినో పట్టుకుని.. ప్రవాహంలో కొట్టుకుపోకుండా భద్రంగా ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.