హాలియా, వెలుగు: సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి హాలియా, నందికొండ మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ నియోజకవర్గం లో హాలియా నందికొండ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులగాను 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ గెలుపొందడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. అభ్యర్థులు కుందూరు వెంకట్ రెడ్డి, చింతల చంద్రారెడ్డి, నకరేకంటి అన్నపూర్ణ సైదులు, గౌని రాజా రమేష్ యాదవ్, చిట్టిపోలు శ్రీదేవి కరుణాసాగర్, బొంగరాల యేసు రాజు , గౌహర్ జబీన్ మజహార్, చెరుపల్లి ముత్యాలు, పిల్లి చంద్రకళ, దేపావత్ ప్రసాద్ నాయక్, ఎడవల్లి మేరీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
