అదానీ గ్రూప్ కి షాక్: గ్యాగ్ ఆర్డర్ కొట్టేసిన ఢిల్లీ కోర్టు..

అదానీ గ్రూప్ కి షాక్: గ్యాగ్ ఆర్డర్ కొట్టేసిన ఢిల్లీ కోర్టు..

తమ పరువుకు నష్టం కలిగించే కంటెంట్ ను పబ్లిష్ చేయకుండా నలుగురు జర్నలిస్టుల నియంత్రించాలంటూ అదానీ గ్రూప్ గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. జర్నలిస్టులు రవి నాయర్, అబీర్ దాస్‌గుప్తా, అయస్కాంత్ దాస్, ఆయుష్ జోషిలు అదానీ గ్రూప్ జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ ను సవాలు ఢిల్లీ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం ( సెప్టెంబర్ 18 ) విచారణ జరిపిన కోర్టు గ్యాగ్ ఆర్డర్ ను కొట్టేసింది.

అదానీ గ్రూప్ పేర్కొన్న వ్యతిరేక పోస్టులు కథనాలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయని.. ఇప్పుడు ఈ నలుగురు జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరడం సరికాదని పేర్కొంది కోర్టు. అదానీ గ్రూప్ వ్యతిరేకిస్తున్న కథనాలు పరువు నష్టం కలిగించేవి కాదని సీనియర్  సివిల్ జడ్జి విచారణలో తేలినట్లయితే.. సదరు కథనాలను రిస్టోర్ చేయడం సరికాదని అన్నారు.

ట్రయిల్ కోర్టులో ప్రతివాదులకు అవకాశం ఇచ్చిన తర్వాత గాగ్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొంది కోర్టు. ఈ క్రమంలో అపీల్ ను అనుమతిస్తున్నామని.. ఈ కేసుపై ఎలాంటి తీర్పు ఇవ్వకుండా గ్యాగ్ ఆర్డర్ ను కొట్టేస్తున్నట్లు వెల్లడించింది కోర్టు.