అలర్ట్: రెండు రోజులు భారీ వర్షాలు

అలర్ట్: రెండు రోజులు భారీ వర్షాలు
  • నేడు, రేపు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో సోమవారం సాయంత్రం నుంచి కొన్ని గంటల పాటు వర్షం కురిసింది. అత్యధికంగా బీహెచ్​ఈఎల్​లో 2.08 సెంటీమీటర్లు, లింగంపల్లి ఎంఎంటీఎస్ పరిధిలో 2.05, షేక్ పేట 1.95,  గచ్చిబౌలిలో 1.93 సెంటిమీటర్ల వర్షం పడింది. నగరంలో  మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో సుమారు 6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్ల వరకు వాన కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్​ జోనల్ కమిషనర్లతో  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలుంటే కంట్రోల్ రూం 040 21111111ను సంప్రదించాలని సూచించారు.