సంగారెడ్డి(హత్నూర), వెలుగు: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం గొర్రెల, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు పశువర్ధక శాఖ డాక్టర్లు హేమలత, సంధ్యారాణి చెప్పారు. వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని కాసాల, దేవులపల్లి, సిరిపుర, తెల్ల రాళ్ల తాండ, ఎల్లమ్మ గూడా గ్రామాల్లో ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు.
2093 గొర్రెలకు, 1107 మేకలకు మందులు వేసినట్లు పేర్కొన్నారు. రైతులందరూ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో కాసాల సర్పంచ్ వెంకటేశ్, దేవులపల్లి సర్పంచ్ బేగరి మల్లేశం, సిరిపురం సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు రైతులు పాల్గొన్నారు.
