సంగారెడ్డి జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత నివ్వాలి

సంగారెడ్డి జిల్లాలో  ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత నివ్వాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, డీఆర్వో పద్మజరాణితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 

17 దరఖాస్తులను సంబంధితశాఖల అధికారులకు ఫార్వర్డ్​చేసి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, పీడీ డీఆర్డీవో జ్యోతి, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.