సంగారెడ్డి టౌన్ ,వెలుగు: సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రఘునందన్ రావు తో కలిసి వార్షిక నివేదికను వెల్లడించారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 8,255 కేసులు నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గుదల నమోదైందని కేసులో 28 శాతం తగ్గడం జిల్లా పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమన్నారు.
హత్యలు 32 శాతం, ఆస్తి కోసం హత్యలు 19%, అత్యాచార కేసులు 21 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. అపహరణ కేసులో 309 శాతం పెరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా మహిళల భద్రతకు నాలుగు సబ్ డివిజన్లలో షీ టీమ్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ నిర్వహిస్తున్నామన్నారు.
