కర్నాటక స్కూల్ బస్సు ర్యాష్ డ్రైవింగ్..5 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

కర్నాటక స్కూల్ బస్సు ర్యాష్  డ్రైవింగ్..5 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

సంగారెడ్డి, వెలుగు: కర్నాటకకు చెందిన 2 స్కూల్ బస్సులు విహారయాత్రకు బయలుదేరాయి. ర్యాష్  డ్రైవింగ్ చేస్తూ  సంగారెడ్డి సమీపంలోకి రాగానే పోలీసులు గుర్తించి అడ్డుకున్నా ఆపకుండా వెళ్లారు. దీంతో సంగారెడ్డి పోలీసులు 5 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్నారు. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన 2 ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 100 మంది డీటీయూ స్కూల్ పిల్లలను హైదరాబాద్ వండర్ లాకు విహారయాత్రకు తీసుకెళ్తున్నారు. ప్రమాదకర స్థితిలో ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను నడుపుతున్న విషయాన్ని సంగారెడ్డి చౌరస్తా వద్ద పోలీసులు గమనించి ఆపే ప్రయత్నం చేశారు. 

ఆపకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రాంగ్ రూట్​లో వెళ్లిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బస్సులను చేజ్ చేసి పట్టుకొని నిలిపివేశారు. బస్సులో స్కూల్ పిల్లలు ఉన్నప్పటికీ ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఏంటని డ్రైవర్లను మందలించారు. తర్వాత బస్సులను అక్కడే ఆపి డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.