హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైనల్ విజేత సంగారెడ్డి జట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైనల్ విజేత సంగారెడ్డి జట్టు

సంగారెడ్డి టౌన్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో జరుగుతున్న వెంకటస్వామి ఇంట్రా డిస్టిక్ టీ 20 టోర్నమెంట్​లో ఫైనల్ మ్యాచ్ శుక్రవారం సంగారెడ్డిలోని ఎస్వీఎం గగన్ మైదానంలో జరిగింది. మెదక్ జిల్లా జట్టు 20 ఓవర్లలో 128 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఫైనల్ మ్యాచ్​లో సంగారెడ్డి జిల్లా జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. 

మెదక్ జట్టుకు చెందిన రెహమత్ 56 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందాడు. ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మధుమోహన్ రెడ్డి, సభ్యులు శ్రీనాథ్ రెడ్డి, రఘుపతి, మధు, విజయ్, కోచ్ కలిముద్దీన్, చంద్రమౌళి, అనిల్ జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.