హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నేడు సానియా ఫేర్‌‌‌‌వెల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నేడు  సానియా ఫేర్‌‌‌‌వెల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌
  • ఊహించిన దానికంటే  ఎక్కువే సాధించా
  • ఒలింపిక్‌‌‌‌ మెడల్‌‌‌‌ ఒక్కటే లోటు: సానియా
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నేడు  సానియా ఫేర్‌‌‌‌వెల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌
  • ఎల్బీ  స్టేడియం టెన్నిస్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌లో ఉ. 10 నుంచి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ సానియా మీర్జా ఎన్నో  చారిత్రక విజయాలు సాధించింది. టెన్నిస్‌‌‌‌‌‌‌‌కే కాకుండా దేశంలో విమెన్​ స్పోర్ట్​కే బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. గత నెలలో కెరీర్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికిన సానియా తన ఆట ఆరంభించిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గడ్డపై  చివరిసారి రాకెట్‌‌‌‌‌‌‌‌ పట్టి బరిలోకి దిగనుంది. ఆదివారం ఎల్బీ స్టేడియం టెన్నిస్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో సొంత ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్​సమక్షంలో సానియా ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. డబుల్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌ బెతానీ మాటెక్‌‌‌‌‌‌‌‌ సాండ్స్‌‌‌‌‌‌‌‌, రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న, ఇవాన్‌‌‌‌‌‌‌‌ డోడింగ్‌‌‌‌‌‌‌‌, కారా బ్లాక్‌‌‌‌‌‌‌‌, మరియోన్‌‌‌‌‌‌‌‌ బర్తోలితో విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌, మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అలరించనుంది. రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన తర్వాత శనివారం మొయినాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన అకాడమీకి వచ్చిన సానియాకు అక్కడి ప్లేయర్లు గార్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హానర్‌‌‌‌‌‌‌‌తో స్వాగతం పలికారు. అనంతరం  బెతానీ మాటెక్‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడిన మీర్జా తన కెరీర్‌‌‌‌‌‌‌‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇకపై సిటీతో పాటు విదేశాల్లో ఉన్న తన అకాడమీల్లో ప్లేయర్లను తీర్చిదిద్దడంతో పాటు తన కొడుకు ఇజాన్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పింది. ‘నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో నేను ఊహించిన దానికంటే ఎక్కువే సాధించా. . ఒక్క ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గకపోవడమే నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో లోటు.  నా చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సొంత అభిమానుల ప్రేక్షకుల ముందు ఆడి వారికి నా కృతజ్ఞత తెలపాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా.  నా కెరీర్​ ప్రారంభమైన చోటుకే తిరిగి రావడం పర్సనల్​గా గొప్పగా అనిపిస్తోంది. ప్రొఫెషనల్​ కెరీర్‌‌‌‌‌‌‌‌ను దాటి  లైఫ్‌‌‌‌‌‌‌‌లో తర్వాతి ఫేజ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఆటపై నాకున్న అవగాహన, నాలెడ్జ్​తో తర్వాతి తరం ప్లేయర్లను ప్రోత్సహిస్తా’ అని సానియా చెప్పుకొచ్చింది. ఇక, జూనియర్‌‌‌‌‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలవడం తన జీవితంలో గొప్ప క్షణం  అని సానియా తెలిపింది. ‘జూనియర్ వింబుల్డన్ గెలిచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వచ్చాక నాకు లభించిన స్వాగతం మరువలేనిది. ఆటలో పైస్థాయికి వచ్చానని నేను భావించిన మొదటి క్షణం అది. నేను మొదటిసారి ఆటోగ్రాఫ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది కూడా అప్పుడే’ అని సానియా తెలిపింది.