షమీతో పెళ్లిపై స్పందించిన సానియా తండ్రి

షమీతో పెళ్లిపై స్పందించిన సానియా తండ్రి

భారత క్రీడారంగంలో క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ షమీ, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వారి రంగాల్లో తమదైన ముద్ర వేశారు. భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా షమీ పేరు తెచ్చుకుంటే.. టెన్నిస్ లో సానియా దేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చింది. వీరి ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నా.. వ్యక్తిగత జీవితం మాత్రం సరిగా లేదనే చెప్పాలి. ఇద్దరూ కూడా తమ భాగస్వామ్యుల విషయంలో గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా సానియా, షమీ వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం తీవ్రంగా జరిగింది. 

షమీ, సానియా వివాహంపై ఇప్పటికీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి.  ఈ విషయంపై తాజాగా సానియా తండ్రి స్పందించాడు. సానియా, షమీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు. ఆయన మాట్లాడుతూ " సానియా, షమీల వివాహంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ బయట నుంచి వస్తున్న చెత్త వార్తలు. ఇప్పటివరకు ఆమె అతన్ని కలవలేదు". అని ఆయన అన్నారు.  దీంతో వీరి పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. 

పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్, సానియా మీర్జా 2024 జనవరిలో విడిపోయారు. దీంతో 13 ఏళ్ల వీరి దాంపత్య జీవితానికి తెర పడింది. షరియా చట్టాల ప్రకారం సానియాకు విడాకులిచ్చిన మాలిక్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌‌ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సానియా ఇటీవలే పవిత్రమైన హజ్ యాత్రను ప్రారంభించింది. మాలికి నుంచి విడిపోయిన తర్వాత  టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈమె.. తాజాగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ లో పండిట్ గా పని చేసింది. 

మరోవైపు భార్యతో విడిపోయిన షమీ వరల్డ్ కప్ లో అదరగొట్టి ఈ టోర్నీలో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో గాయపడిన షమీ ఆ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. 2024 ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఈ టీమిండియా పేసర్ ఆగస్టు నెలలో భారత జట్టులో చేరే అవకాశం ఉంది.