శాంసన్‌కు రాయల్స్ తరఫున వందో మ్యాచ్‌.. హైదరాబాద్ గెలిచేనా..?

 శాంసన్‌కు రాయల్స్ తరఫున వందో మ్యాచ్‌.. హైదరాబాద్ గెలిచేనా..?

పుణే:  పుణే: ఐపీఎల్ -15వ సీజన్ భాగంగా నేడు హైదరాబాద్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ కి ఈ మ్యాచ్ కీలకం కానుంది.  రాజస్థాన్‌ రాయల్స్‌ స్కిప్పర్‌ సంజూ శాంసన్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలువనుంది. ఈ మ్యాచ్‌ శాంసన్‌కు రాజస్థాన్ రాయల్స్ తరఫున వందో మ్యాచ్‌ కానుంది. గతంలో అజింక్య రహానే ఒక్కడే ఆర్‌ఆర్‌ తరఫున ఈ ఘనత సాధించాడు. 2013లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన శాంసన్‌ ఇప్పటి వరకు 121 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 15 అర్ధశతకాల సాయంతో 134.21 సగటున 3068 పరుగులు చేశాడు.  దీంతో 100వ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండేలా తప్పకుండా ఘన విజయం సాధించి ఈ సీజన్ లో బోణీ కొట్టాలని చూస్తుంది RR. అటు హైదరాబాద్ లోనూ బౌలింగ్, ఆల్ రౌండర్స్ ఉండటంతో గెలుపు అంతా ఈజీ కాదు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న రాజస్తాన్ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.