సికింద్రాబాద్ మోండా మార్కెట్లో భారీ చోరీ.. రూ.25 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

సికింద్రాబాద్ మోండా మార్కెట్లో భారీ చోరీ.. రూ.25 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో బంగారంపై దొంగల ఫోకస్ ఎక్కువైంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అనుకుంటున్నారో ఏమో కానీ.. ఇండ్లు, షాపులు తాళాలు పగలగొట్టీ లక్షల విలువైన గోల్డ్ చోరీ చేస్తున్నారు. శుక్రవారం (జనవరి 23) రాత్రి సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో బంగారు షాపు తాళలు పగలగొట్టి ఆభరణలు ఎత్తుకెళ్లటం కలకలం రేపింది. 

మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్గీష్ జువెలరీ షాపులో బంగారు ఆభరణాలను తయారు చేస్తుంటారు. ఎప్పటిలాగే ఉదయం షాపు ఓపెన్ చేయడానికి వచ్చిన ఓనర్లు.. షటర్ తాళం పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు. లోపలికి వెళ్లి చూసే సరికి తయారు చేసి ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. 

బెంగాల్ తో పాటు ఇతర ప్రాంతల నుంచి వచ్చిన బంగారు ఆభరణాల కార్మికులు ఈ షాపులో పనిచేస్తున్నట్లు ఓనర్లు తెలిపారు. దీంతో ఇది తెలిసిన వారి పనే కావచ్చు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు ఓ యువకుడు బ్యాగుతో వెళ్లిపోతున్న దృశ్యాలు గుర్తించారు. కేసు నమోదు చేసి బ్యాగుతో పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు