సంజు శాంసన్‌ డబుల్‌ సెంచరీ

సంజు శాంసన్‌ డబుల్‌ సెంచరీ

అలుర్‌‌(కేరళ): యువ వికెట్‌‌ కీపర్‌‌‌‌ రిషబ్‌‌ పంత్‌‌ నిలకడలేమి ఆటపై తీవ్ర చర్చనడుస్తున్న సమయంలో టీమిండియాలో అతనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న కేరళ యంగ్‌‌స్టర్‌‌ సంజు శాంసన్‌‌ విధ్వంసకర బ్యాటింగ్‌‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విజయ్‌‌ హజారే ట్రోఫీలో డబుల్‌‌ సెంచరీతో పరుగుల మోత మోగించాడు. గ్రూప్‌‌–-ఎలో భాగంగా శనివారం గోవాతో జరిగిన మ్యాచ్‌‌లో శాంసన్‌‌ (129 బంతుల్లో 20 ఫోర్లు, 10 సిక్సర్లతో 212) వీరవీహారం చేశాడు. దీంతో కేరళ 104 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌‌ చేసిన కేరళ.. సంజు సునామీ ఇన్నింగ్స్‌‌తో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 377 పరుగులు చేసింది. ఛేజింగ్‌‌లో  గోవా 8 వికెట్లకు 273 పరుగులే చేసి ఓడింది. తన ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో విజయ్‌‌ హజారే ట్రోఫీలో టాప్‌‌ స్కోరు నమోదు చేసిన శాంసన్‌‌.. లిస్ట్‌‌-–ఎ క్రికెట్‌‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌‌ కీపర్‌‌గా వరల్డ్‌‌ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌‌లో సచిన్‌‌ బేబీ( 135 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 127)తో కలిసి శాంసన్‌‌ జతచేసిన338 పరుగుల పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ లిస్ట్‌‌–-ఎ క్రికెట్‌‌లో మూడో వికెట్‌‌కు అత్యుత్తమం.