టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ పరుగుల వరద పారిస్తున్నాడు. మెగాటోర్నీలో టీమిండియాకు ఎంతో కీలకమైన మ్యాచుల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లపై హాఫ్ సెంచరీలతో రాణించి భారత్కు విజయాన్నందించిన సంజు.. న్యూజిలాండ్తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచులోనూ అర్ధ శతకం బాదాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చెలరేగి ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు 52 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు.. న్యూజిలాండ్ బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోస్తున్నారు. దీంతో టీమిండియా 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో సంజు 67, ఇషాన్ కిషాన్ 34 ఉన్నారు. బ్యాటర్ల ఊపు చూస్తుంటే ఫైనల్లో భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.
భారత్ ప్లేయింగ్ ఎలైవన్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలైవన్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
