పతంగుల పండుగ షురూ

పతంగుల పండుగ షురూ

పరేడ్ గ్రౌండ్స్‌లో పండుగ జోష్

పరేడ్ గ్రౌండ్స్‌లో వెయ్యి రకాల స్వీట్లతో స్టాళ్లు

ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 15 దేశాల ప్లేయర్స్‌తోపాటు మనదగ్గరి చిన్నా, పెద్ద హాజరై అబ్బురపరిచే పతంగులు ఎగరవేశారు. వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన వెయ్యి రకాల స్వీట్స్ స్టాళ్లలో నోరూరిస్తున్నాయి. గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు బుధవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో పతంగులు, మిఠాయిల ఉత్సవం నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుందని టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి. వెంకటేశం తెలిపారు. జపాన్, ఆస్ట్రేలియా, మలేషియా, టర్కీ వంటి 15 దేశాలతో పాటు గుజరాత్, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలకు చెందిన 37మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 దాకా పలు కార్యక్రమాలతో ఫెస్టివల్కు వచ్చేవారిని అలరించనున్నారు. 200 వినూత్న ఆకారాలతో గాలిపటాలు పరేడ్ గ్రౌండ్స్లో ఎగరనున్నాయి. వెయ్యి రకాల మిఠాయిలు స్వీట్ ఫెస్టివల్లో ఆస్వాదించవచ్చు.

ట్రాఫిక్ డైవర్షన్
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం వరకు పలు రూట్లలో ట్రాఫిక్మళ్లిస్తున్నట్టు జాయింట్ సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రాత్రి 10గంటల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. కైట్ ఫెస్టివల్ జరిగే పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్న నేపథ్యంలో నిర్ధేశించిన రూట్లలోనే వాహనదారులు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ రూట్లలో వెళ్లాలి..
ప్లాజా నుంచి టివోలి ఎక్స్ రోడ్స్ :– ప్లాజా వద్ద ఎస్బీఐ– వైఎంసీఏ లెఫ్ట్ టర్న్- తీసుకుని స్వీకర్ ఉపకర్ మీదుగా టివోలి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లింపు.
ఎస్బీఐ జంక్షన్ నుంచి స్వీకర్ ఉపకర్ వైపు: ఎస్బీఐ మీదుగ వైఎంసీఏ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని- స్వీకర్ ఉపకర్ జంక్షన్ వైపు వెళ్లాలి.
టివోలి నుంచి ప్లాజా వైపు: టివోలి జంక్షన్, బ్రూక్ బాండ్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని -లీ రాయల్ ప్యాలెస్, సీటీవో మీదుగా స్వీకర్ ఉపకర్ జంక్షన్, -వైఎంసీఏ వద్ద రైట్ టర్న్ వైపు మళ్లింపు.