సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్న జనం.. హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్న జనం.. హైదరాబాద్ లో  భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. కొంతముంది తమ సొంత కార్లు, ప్రైవేట్ ట్రావెల్స్ లో సొంతూళ్లకు పయనం కాగా, పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక యువత తమ బైక్‌లపై స్నేహితులతో కలిసి పండుగకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీటిలో ఉదయం నుంచి రాత్రి వరకు విపరీతంగా ట్రాఫిక్ జాం అవుతోంది.

ముఖ్యంగా ట్రాఫిక్ జాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బస్సులు, కార్లలోని ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అందులో మహిళలు, పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

అమీర్ పేట్ లో సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఊరికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. JBS బస్సు డిపోలో ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న కూడా సమయానికి బస్సులు లేకపోవడంతో.. గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు చెపుతున్నారు. పండగ సందర్భంగా గ్రామాలకు ఇంకా చాలా మంది వెళ్లనున్నారని.. అధికారులు మరికొన్ని బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు.