ఇయాల్టి (జనవరి 10) నుంచి స్కూళ్లకు సంక్రాంతి హాలీడేస్..17న రీఓపెన్

ఇయాల్టి  (జనవరి 10) నుంచి స్కూళ్లకు సంక్రాంతి హాలీడేస్..17న రీఓపెన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకూ ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు వారం రోజుల పాటు హాలిడేస్​ కొనసాగనున్నాయి. 

ఈ నెల17న బడులు తిరిగి తెరుచుకోనున్నాయి. స్కూళ్లు సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీలకూ ఈ నెల 10 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి.