- ఆటల పోటీల్లో యువత పాల్గొనాలి
- కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న సంసద్ ఖేల్ మహోత్సవ్ లో యువత భాగస్వామ్యులై సక్సెస్ చేయాలని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో గురువారం కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి, రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్‌ను ప్రారంభించారు.
డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్లు చేపడుతామన్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్‌నియోజకవర్గంలో, డివిజన్‌వారీగా పోటీలు జరిపి, అసెంబ్లీ స్థాయి నుంచి పార్లమెంట్‌స్థాయి వరకు ఎంపికలు ఉంటాయని చెప్పారు. బాయ్స్, గర్ల్స్ కు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని క్రీడలకు అంకితం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్, నాయకులు బండ కార్తీక రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, టి.రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
