సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న సినిమా విడుదల కానుంది. ట్రెలర్ రిలీజైన క్షణాల్లోనే యూట్యూబ్లో దూసుకెళ్తోంది.
ఇదొక జెన్యూన్ ఇంటెన్షన్తో, హానెస్ట్గా చేసిన సినిమా అని తెలుస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, మానస వారణాసి వెండితెరకు కొత్త గ్లామర్ తీసుకొచ్చింది.స్ట్రగుల్స్, లవ్, ఎమోషన్స్, రొమాన్స్, డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి.
‘ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావో’ అని అంటుంటే.. ‘నేను నా జీవితం తప్ప ఎవరి జీవితాన్నీ నాశనం చేయలేదండీ’ అంటూ హీరో నవ్వులు పూయించాడు. ఆ తర్వాత ట్రైలర్ ముగింపులో ‘ లవ్ ఛాయిస్ హ ? నీడ్ హా? అని నాకు తెలియదు. ఫేట్ అని మాత్రమే తెలుసు.. అది రావాలనుకుంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు..’ అని హీరో పలికే మాటలు గుండెను హత్తుకునేలా ఉంటాయి. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘చిన్న గ్యాప్ తర్వాత నేను చూపించబోయే కథ ఇరవై ఏళ్ల పాటు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశా. ఇందులో నేను పోషించిన శివ అనే క్యారెక్టర్‌కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తా.
శివ నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, మిత్ర (మానస వారణాసి) చిత్తూరు నుంచి వస్తుంది. వాళ్లు చెన్నైలో కలుస్తారు. శివ, మిత్ర అనే పాత్రలు నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో, హానెస్ట్గా చేసిన సినిమా ఇది’ అని అన్నాడు. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీ ఇదని, రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని హీరోయిన్ మానస వారణాసి చెప్పింది.
డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘సినిమా చూస్తున్నప్పుడు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు అనే ఫీల్ అందరిలో తప్పకుండా కలుగుతుంది. నేను ఈ కథ రాసినప్పుడు శివ, మిత్రతో పాటు కథ జరిగే చెన్నై నగరాన్ని కూడా ఒక పాత్రలా అనుకున్నాను’ అని చెప్పాడు. సినిమాను విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని, కో ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు పాల్గొన్నారు.
