ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సారా అర్జున్. మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'దురంధర్' లో కథానాయికగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు 'యుఫోరియా'తో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నా రు.
కాగా.. ఇటీవల సంచలనం సృష్టించిన చిత్రం 'ధురంధర్' . ఇందులో ప్రధాన పాత్రలో నటించిన రణ్వీర్ సింగ్ తో కలిసి నటించింది. అయితే సారా అర్జున్ మధ్య 20 ఏండ్ల వయసు తేడా ఉంది. దీంతో ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై సారా అర్జున్ ఒక ఇంటర్యూలో స్పందించారు.. 'నేను సోషల్ మీడియాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉండను. అందుకే అవి నా వరకు రాలేదు అని చెప్పుకొచ్చింది..
►ALSO READ | Nidhhi Agerwal: ఇండస్ట్రీలో నన్ను తొక్కేసేందుకు భారీ కుట్ర.. నెగిటివ్ క్యాంపెయిన్‌పై నిధి అగర్వాల్ ఎమోషనల్!
అయినా అలాంటి విమర్శలను నేను పట్టించుకోను అని తెలిపింది సారా అర్జున్. ఒక విషయంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. 'మనం ప్రశాంతంగా ఉందాం.. పక్కవారిని ప్రశాం తంగా ఉండనిద్దాం' అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను, పాటిస్తాను. నాకు 'ధురంధర్' స్టోరీ నచ్చింది. దానికి నేను న్యాయం చేస్తానని అనిపించింది. అందుకే ఒకే చేశా. వినోదం కోసం ఇతర మార్గాలు ఎంచుకుంటా. బ్రేక్ టైంలో ట్రిప్ లకు వెళ్తుంటా. నేను ఒకేచోట ఎక్కువ రోజులు ఉండలేను' అంటూ సారా చెప్పుకొచ్చింది.
