బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ మరియు సినీ నిర్మాత ఆధిత్య దోర్ డైరెక్ట్ చేస్తున్న హిందీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితర ఇతర స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో రణబీర్ సింగ్ కి జోడీగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్ నటిస్తోంది. దీంతో ఈ విషయం బాలీవుడ్ సినీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సారా అర్జున్ వయసు 19 ఏళ్ళు మాత్రమేనని, రణబీర్ అనుభవజ్ఞుడైన నటుడని దీంతో వీరిద్దరికీ నటనాపరంగా పొంతన కుదరదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :- స్టోరీ, స్క్రీన్‌ప్లే నేనే రాశాను
అంతేగాకుండా సినిమాకి హీరో ఎంత ముఖ్యమో, హీరోయిన్ కూడా అంతే ముఖ్యమని, ఈ ఇద్దరిలో ఎవరు బాగా నటించకున్నా ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం ఇలా ఉండగా నటి సారా అర్జున్ గతంలో హిందీ, మలయాళం, తెలుగు తదితర భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మధ్య వయసు పెరగడంతో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించడం మానేసింది సారా అర్జున్. ఈ క్రమంలో హీరోయిన్ గా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తూ ఏకంగా రణబీర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అఫర్ దక్కించుకుంది.