IND vs AUS 3rd T20I: గిల్ క్లాసికల్ బౌండరీ.. సంతోషంతో స్టాండ్స్‌లో సారా చప్పట్లు.. నెక్స్ట్ బాల్‌కే ఔట్

IND vs AUS 3rd T20I: గిల్ క్లాసికల్ బౌండరీ.. సంతోషంతో స్టాండ్స్‌లో సారా చప్పట్లు.. నెక్స్ట్ బాల్‌కే ఔట్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ ప్రేమాయణం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే వీరిద్దరి ప్రేమ నిజమో..! అబద్దమో! తెలియక అభిమానులు తలలు పట్టుకుంటుంటే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గిల్ ఆడుతుంటే సారా పట్టలేని సంతోషంతో చప్పట్లు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఎల్లిస్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు రాబట్టిన గిల్ రెండో బంతికి లాంగాఫ్ లో ఒక చూడ చక్కని బౌండరీ బాదాడు. గిల్ ఫోర్ కొట్టడడంతో వంటనే కెమెరా సారా టెండూల్కర్ వైపు చూపించారు. సారా సంతోషంతో చప్పట్లు కొడుతూ కనిపించింది. 

సారా స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ కు రావడమే ఆశ్చర్యానికి గురి చేస్తే.. గిల్ బ్యాటింగ్ కోసమే వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ ఓవర్ లో ఆ తర్వాత బంతికే గిల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. ఎల్లిస్ వేసిన స్లో డెలివరీ యార్కర్ ఆడే క్రమంలో టైమింగ్ మిస్ కావడంతో బంతి ప్యాడ్లకు తగిలింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. ఇండియా రివ్యూ తీసుకున్నా ఫలిత,ఎం లేకుండా పోయింది. శుభమాన్ ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమవుతున్నాడు. వన్డే సిరీస్ లో ఘోరంగా విఫలం కాగా.. టీ20 ఫార్మాట్ లోనూ బ్యాట్ కు ఇంకా పని చెప్పలేదు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం (నవంబర్ 2) హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో జరిగిన హాయ్ స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆతిధ్య ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. భారీ ఛేజింగ్ లో వాషింగ్ టన్ సుందర్ (23 బంతుల్లో 49: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత క్యామియోతో పాటు మిగిలిన టీమిండియా బ్యాటర్లు తలో చేయి వేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో ఇండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి గెలిచింది.