- సరస్వతి విద్యాపీఠం కార్యదర్శి
- లింగం సుధాకర్ రెడ్డి
ఓల్డ్‌సిటీ, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండానే సరస్వతి శిశు మందిరాల్లో ఉచితంగా గిరిజన, బడుగు వర్గాలకు విద్య అందిస్తూ దేశభక్తి, సంస్కృతిని పెంపొందిస్తున్నామని దక్షిణ భారత సరస్వతి విద్యాపీఠం కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విద్యకే పరిమితం కాకుండా సీబీఎస్‌ఈ స్కూల్లు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఐఏఎస్ కోచింగ్ అకాడమీలతో పాటు మారుమూల గ్రామాల్లో ఏకోపాధ్యాయ స్కూళ్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఛత్రినాక చిత్రగుప్త దేవాలయంలోని కందికల్ గేట్ సరస్వతి శిశు మందిర్‌లో పూర్వ విద్యార్థుల 50వ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా లింగం సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. పూర్వ విద్యార్థుల సహకారంతో అన్ని వర్గాలకు, గ్రామాలకు విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.బి.పాటిల్, పతకమూరి శ్రీనివాస్, మీనోషి మహేశ్వరి, బోడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
