రవాణా శాఖలో యథావిధిగా ‘సారథి’ సేవలు

రవాణా శాఖలో యథావిధిగా ‘సారథి’ సేవలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రవాణా శాఖలో ‘సారథి’ సేవలు యథావిధిగా కొనసాగాయి. సోమవారం దేశ వ్యాప్తంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌‌ఐసీ )లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో మన రాష్ట్రంలో ‘సారథి’ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఖైరతాబాద్‌‌తో పాటు అన్ని జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ సేవలు నిలిచిపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో జనం పడిగాపులు కాశారు. ముందుగా స్లాట్‌‌లను బుకింగ్ చేసుకున్న వారు ‘ సారథి’ సమస్యతో తమ లెర్నింగ్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌‌లను పొందలేకపోయారు. అయితే, మంగళవారం ఉదయం నుంచి ఈ సేవలు యథావిధిగా కొనసాగడంతో ఇటు జనం, అటు రవాణా శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.