‘సరిగమప’ ది సింగింగ్ సూపర్ స్టార్ షో... తెలుగింటి పాటలతో ఆడియెన్స్‌ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షోలో సింగర్స్ టాలెంట్‌ని గుర్తించే ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు. వాళ్ల జీవితంలోని మర్చిపోలేని జ్జాపకాల్ని, ఫ్యామిలీని మిస్ అయిన రోజుల్ని అందరితో పంచుకునే వేదిక అవుతోంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో ప్రతి ఆదివారం సెలబ్రిటీలని గెస్ట్లుగా పిలుస్తారు. ఈవారం హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత స్పెషల్ గెస్ట్లుగా రాబోతున్నారు. వీళ్ల ఎంట్రీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది జీ తెలుగు. ప్రోమోలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కూడా కనిపించాడు. సింగర్స్ టాలెంట్‌ని మెచ్చుకోవడమే కాకుండా వాళ్లపై ఫన్నీ కామెంట్లు చేసింది జీవిత. సరిగమప షో జీ తెలుగులో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది.
