శ్రీరామ్ నిమ్మల, సాయి కీర్తన జంటగా లారా దర్శకత్వంలో తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సర్కార్ బాయి’. సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపులో గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అతిథిగా హాజరైన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు లారా మాట్లాడుతూ ‘1985 తెలంగాణ సామాజిక నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అప్పట్లో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకున్నాం’ అని అన్నాడు. బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
