
సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ సినిమాతో వస్తాడనుకున్న మహేష్ బాబు, ఏప్రిల్‌కి షిప్ట్ అయ్యాడు. సంగీత దర్శకుడు తమన్ మాత్రం అప్పుడప్పుడు ఈ మూవీ మ్యూజిక్ బిట్స్‌తో అభిమానులను ఊరిస్తున్నాడు. రీసెంట్‌గా టైటిల్ సాంగ్ ట్యూన్‌ను కాసేపు సోషల్ మీడియా ద్వారా వినిపించాడు. నిమిషంలోపు ఉన్న ఈ మెలొడియస్ ట్యూన్ విని ఖుషీ అవుతున్నారు అభిమానులు. అతిత్వరలో ఈ సాంగ్ రాబోతోందనే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మొదలయ్యాయి. నిజానికి సంక్రాంతికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రావాల్సి ఉంది. కానీ కొవిడ్‌తో అభిమానులకు నిరాశ తప్పలేదు.
ప్యాండమిక్‌తో అప్‌డేట్స్ ఇవ్వలేకపోతున్నామని, పాట కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయమంటూ సారీ చెప్పారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని సాంగ్స్ కంపొజిషన్ పూర్తయింది. పాటలన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయంటున్నాడు తమన్. ఇక పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుత కొవిడ్ సిట్యువేషన్స్‌తో ఆ రిలీజ్ డేట్ మారే అవకాశాలు లేకపోలేదు.