
‘కళావతి’ పాటతో ప్రమోషన్‌లో స్పీడు పెంచింది ‘సర్కారు వారి పాట’ మూవీ టీమ్. మహేష్, కీర్తి సురేష్ జంటపై తీసిన ఈ రొమాంటిక్ సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకెళుతోంది. త్వరలోనే మరో సాంగ్ రాబోతోంది. ఈ విషయంపై రీసెంట్‌గా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు తమన్. మార్చి 18న ఈ పాటను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌లో బిజీగా ఉన్నాడు మహేష్‌బాబు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మహేష్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సముద్రఖని, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కానుంది.