ఒక్క పైసా డొనేషన్ తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ : సరోజా వివేక్

ఒక్క పైసా డొనేషన్ తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ : సరోజా వివేక్

డొనేషన్ లేకుండా పేద విద్యార్థులకు  విద్యను అందిస్తున్నామని బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ కరస్పాండెంట్ సరోజా వివేక్  అన్నారు.  కాలేజీ గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్న ఆమె.. గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు.  పేద విద్యార్థుల కోసం 1997లో  కాకా విద్యాసంస్థలు ప్రారంభించారని చెప్పారు.  యూనియన్ మినిస్టర్ అయినా  కల మర్చిపోకుండా తన రోల్ మోడల్ అయినా అంబేద్కర్  పేరుతో కాకా విద్యా సంస్థలు స్థాపించారని చెప్పారు..

అంబేద్కర్ పేరు మీద విద్యార్థులకు సేవ చేస్తున్నామని చెప్పారు సరోజా వివేక్. అంబేద్కర్ విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నారన్నారు. కాలేజీలో ఒక్క పైసా డొనేషన్ తీసుకోవడం లేదన్నారు.  80 శాతం మార్కులు వచ్చిన  విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నామన్నారు. 

టెన్త్ తరువాత డీస్ కంటిన్యూ అవ్వకుండా జూనియర్ కాలేజీలో అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు సరోజా వివేక్. దేశంలో అంబేద్కర్ లా కాలేజ్20వ స్థానంలో ఉందన్నారు.  ఇటీవల  సెలెక్ట్ అయినా జూనియర్ జడ్జెస్ లో లా కాలేజ్ స్టూడెంట్స్ నలుగురు ఉన్నారని తెలిపారు.