ఎల్బీనగర్, వెలుగు: హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో ఉన్న ఓ ఇంటికి సరూర్ నగర్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్ కేటాయించారు. హయత్ నగర్ సర్కిల్ పరిధిలోకి వచ్చే ఇంటికి నంబర్ కోసం ఓ వ్యక్తి అధికారులను ఆశ్రయించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో హయత్ నగర్ సర్కిల్ అధికారులు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి సరూర్ నగర్ అధికారులను ఆశ్రయించారు. వారు నిబంధనలను తుంగలో తొక్కి తమ సర్కిల్ కాకపోయినా ఆ ఇంటికి హౌజ్ నంబర్ ఇచ్చి అసెస్ మెంట్ చేశారు. అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
