మాస్క్ పెట్టుకోని మాజీ ఎమ్మెల్యే.. ఫైనేసిన పోలీసులు

మాస్క్ పెట్టుకోని మాజీ ఎమ్మెల్యే.. ఫైనేసిన పోలీసులు

చట్టం అందరికీ సమానమే అంటూ ఓ ఎస్సై.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి జరిమానా విధించాడు. కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద సరూర్‌నగర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో అటువైపుగా వెళ్తున్నారు. దాంతో పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సబ్ ఇన్‌స్పెక్టర్ ముకేష్.. తీగలను ప్రశ్నించాడు. అందుకు తాను మాజీ ఎమ్మెల్యేనని వాగ్వాదానికి దిగాడు. దాంతో మాకు అందరూ సమానులేనని ఎస్సై సమాధానమిచ్చి.. తీగలకు రూ. వెయ్యి ఫైన్ విధించాడు.