లంచగొండి అధికారుల బాగోతం బయటపెట్టిన సర్పంచ్

లంచగొండి అధికారుల బాగోతం బయటపెట్టిన సర్పంచ్

ఈ రోజుల్లో ప్రభుత్వాఫీసుల్లో పని జరగాలంటే లంచం ముట్టాల్సిందేనన్న ధోరణికి ఓ సర్పంచ్ తన రీతిలో సమాధానమిచ్చాడు. దీంతో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలై.. ఈ రోజు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని శంభాజీ నగర్ జిల్లా గోరై అనే గ్రామ సర్పంచ్  మంగేష్.. ఊర్లోని రైతుల అవసరాల కోసం ఓ బావిని తవ్వించాలనుకున్నాడు. అందుకు అనుమతి కోరుతూ పంచాయతీ బ్లాక్‌కు ప్రతిపాదనలు పంపించాడు. కానీ ఆ ప్రతిపాదనలను ఆమోదించేందుకు పంచాయతీ అధికారి బావి నిర్మాణానికి అయ్యే ఖర్చులో12శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.  

ఈ విషయంపై బాగా ఆలోచించిన గ్రామ సర్పంచ్ మంగేష్.. లంచగొండి అధికారులకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రూ. 2 లక్షల విలువైన నోట్ల కట్టలను మెడలో దండగా వేసుకొని మంగేష్ జిల్లా పంచాయితీ బ్లాక్ కార్యాలయం వద్దకు వచ్చాడు. అలా వచ్చే క్రమంలో కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ, తనను పంచాయితీ అధికారులు లంచం అడిగారని చెబుతూ వచ్చాడు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో ద-ృశ్యాలను చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రభుత్వాధికారుల అవినీతి వెలుగులోకి వచ్చింది.

https://twitter.com/dhavalkulkarni/status/1642254219750313984

ఇలా బావి కోసం ఆ గ్రామానికి చెందిన దాదాపు 20 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిని కూడా ఆ అధికారులు లంచం అడగడంతోనే అవి పెండింగుల్లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తు్న్నాయి. బావుల తవ్వకాలే కాదు.. పంచాయితీ పరిధిలోకి వచ్చే వేటి నిర్మాణం చేపట్టాలన్నా అధికారులు ఇలా లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తు్న్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అధికారులపై మండిపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.