సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి : యాదయ్యగౌడ్

సర్పంచుల పెండింగ్ బిల్లులు  చెల్లించాలి  :  యాదయ్యగౌడ్
  • సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్​

హైదరాబాద్, వెలుగు: సర్పంచుల పెండింగ్​బిల్లులు చెల్లించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్​చేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాజీ సర్పంచులు ఎన్నికల సంఘం కమిషనర్​రాణి కుముదినిని కలిసి వినతి పత్రం అందజేశారు. 

అనంతరం యాదయ్య గౌడ్​ మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మెడబోయిన గణేశ్, పకీర బీరప్ప, బస్మాపురం స్వప్న తదితరులు పాల్గొన్నారు.