దివ్యాంగుల శాఖ  డైరెక్టర్ గా సర్వేశ్వర్ రెడ్డి

దివ్యాంగుల శాఖ  డైరెక్టర్ గా సర్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : దివ్యాంగుల శాఖ డైరెక్టర్ గా సర్వేశ్వర్ రెడ్డికి ఎఫ్ ఏ సీ ( పూర్తి అదనపు బాధ్యతలు ) మహిళ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ శృతి ఓజా ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా దివ్యాంగుల కో అపరేటివ్ కార్పోరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు జీవో లో పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న  సత్యనారాయణ ను రిలీవ్ చేస్తున్నట్లు  జీవో లో పేర్కొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డైరెక్టర్ గా సర్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.