కొంగుకే కట్టేసుకుంటాలే.. ‘సతీ లీలావతి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కొంగుకే కట్టేసుకుంటాలే.. ‘సతీ లీలావతి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

లావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ నిర్మిస్తున్నారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ ఫేమ్ తాతినేని స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, మంగళవారం ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే  మొదటి పాటను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సాంగ్ కంపోజ్ చేయగా, వనమాలి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. నూనత మోహన్, కృష్ణ తేజస్వి, రితేష్ జి రావ్ కలిసి పాడారు.

‘మెరికలాంటి కుర్రోడమ్మ.. చురుకు చూపు చిన్నోడమ్మ.. వాడివెంట సాగేదాక ఆగేనా నా ప్రేమ.. వాడ్ని ముద్దుతో రోజంతా మురిపించేస్తాలే.. చంటి పిల్లాడిలా కొంగుకే కట్టేసుకుంటాలే..ఎన్ని తప్పుల్ని చేస్తున్నా మన్నించేస్తాలే’  అంటూ లావణ్య, దేవ్ మోహన్ పెళ్లి వేడుకగా సాగిందీ పాట. పెళ్లి దుస్తుల్లో  వీరిద్దరి లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.  బృంద మాస్టర్ కొరియోగ్రఫీలో వీరు చేసిన డ్యాన్స్ మూమెంట్స్, విజువల్స్  ఆకట్టుకున్నాయి. నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, తాగుబోతు రమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.