ప్రపంచమంతా సత్యసాయి ప్రేమను పంచారు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచమంతా సత్యసాయి ప్రేమను పంచారు: మంత్రి శ్రీధర్ బాబు

బషీర్​బాగ్, వెలుగు: మనుషులు ప్రేమ, వాత్సల్యంతో పనిచేస్తే దైవత్వం సిద్ధిస్తుందని బోధించిన మహనీయులు పుట్టపర్తి సత్యసాయి సాయిబాబా అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో సత్యసాయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారని, లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని గుర్తు చేశారు. 

ఎంతో మందికి తాగునీరు అందించారని, ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యమందించారని తెలిపారు. ప్రపంచ దేశాల్లోనూ సత్యసాయి ట్రస్టు సేవలందిస్తోందని. దీనికి లక్షల మంది వాలంటీర్లు ఉన్నారన్నారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ డీజీపీ హెచ్ జే దొర, తెలంగాణమినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జన ప్రసాద్, తెలంగాణ పూర్వ సలహాదారు డా. కేవీ రమణాచారి పాల్గొన్నారు.