
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని భగవానుడు కర్మలకు అధిపతి. కర్మ ప్రభావాలను నిర్ణయిస్తూ అవి సక్రమంగా అమలయ్యేలా చూడటమే శని దేవుడు పని. శని భగవానుడి అనుగ్రహం మంచి స్థితిలో ఉన్న వ్యక్తులు హాని చేసే కర్మల ప్రభావాన్ని తగ్గిస్తాడు. అంతటి పవర్ ఫుల్ గల శని భగవానుడికి ఈ ఏడాది దసరా తరువాత రెండు (అక్టోబర్3, 4) రోజులు అత్యంత శక్తిని కలిగి ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మీనరాశిలో తిరోగమనంలో ఉన్న శని భగవానుడు 3 వ తేది పూర్వభాద్ర నక్షత్రంలో మారడం.. ఆ తరువాత రోజు 4 వతేది శనివారం.. త్రయోదశి కావడంతో శని భగవానుడి శక్తి మూడింతలు పెరుగుతందని చెబుతున్నారు.
దసరా పండుగ రోజు శని గ్రహం అత్యంత శక్తి కలిగి ఉంటాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాలు.. రాశులు.. నక్షత్రాల ఆధారంగా.. ఆ సమయంలో ఆరోజు ఉన్న నక్షత్రం ఏమిటి.. ఆ నక్షత్రంలో ఏరాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది.. ఆ సమయంలోఆ నక్షత్రానికి .. రాశికి సంబంధం ఎలా ఉంటుంది. అనే విషయాలను అంచనా వేస్తూ... ఆ లెక్కల ఆధారంగా జ్యోతిష్య పండితులు గ్రహాల శక్తిని అంచనా వేస్తారు. నవగ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ( 2025) దసరా పండుగ సమయంలో శని భగవానుడు మీనరాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. శని కర్మఫలాలకు అధిపతిగా ఉండి నిర్ణయిస్తుంటాడు. . పురాణాల ప్రకారం దసరా చెడుపై మంచి విజయం సాధించిన రోజు.
దసరా తరువాత రోజు అంటే అక్టోబర్ 3 వ తేదిశుక్రవారం పూర్వాభాద్ర నక్షత్రంలో శనిభగవానుడు ప్రవేశించనున్నాడు.శనిగ్రహం నక్షత్రం మారడం వలన ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని చోటుచేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. తెలివితేటలు.. ఆర్థిక వ్యవహారాలు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పూర్వాభాద్ర నక్షత్రం .. శని గ్రహంతో నేరుగా కలవడంతో శని భగవానుడికి అధిక శక్తి వస్తుంది. ఈ సమయంలో శని ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
శని భగవానుడు అధికంగా శక్తి కలిగి ఉండటం వలన చేయాల్సిన పరిహారాలు
- శనిభగవానుడికి నువ్వులనూనెతో అభిషేకం
- నల్ల నువ్వులతో పూజ
- శని భగవానుడి ఎదుట నువ్వుల నూనె..నల్లని ఒత్తితో దీపారాధన చేయడం
- నల్లని వస్త్రాలు సమర్పించడం.
- నువ్వులు.. బెల్లం కలిసిన పదార్దాలను నైవేద్యం సమర్పించడం
- పేదలకు వస్త్రదానం.. అన్నదానం చేయడం
- నువ్వులు దానం తీసుకొనే బ్రాహ్మణులకు నల్ల నువ్వుల దానం
- బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడం
- తరువాత శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం