
షెన్‌జెన్: ఇండియా డబుల్స్‌స్టార్‌ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్–చిరాగ్‌షెట్టి జోడీ వరుసగా రెండో టోర్నీలోనూ ఫైనల్లో తడబడ్డారు. చైనా మాస్టర్స్–750 టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్‌డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 19–21, 15–21తో వరల్డ్ నంబర్‌వన్‌కిమ్‌వోన్‌హో–సియో సుయెంగ్‌జీ (కొరియా) చేతిలో ఓడారు. ఇటీవల హాంకాంగ్ఓపెన్లోనూ రన్నరప్‌గానే నిలిచిన ఇండియన్ జోడీ ఈ ఏడాది ఒక్క టైటిల్‌కూడా నెగ్గలేదు.
45 నిమిషాల మ్యాచ్‌లో సాత్విక్‌ద్వయం వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది. తొలి గేమ్‌లో 14–7 ఆధిక్యంలో నిలిచినా క్రమంగా వెనకబడింది. సాత్విక్–చిరాగ్‌తప్పిదాలు చేయడంతో కొరియన్లు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి స్కోరును 15–15తో సమం చేశారు. ఈ దశలో ఇరు జంటలు పవర్స్మాష్లతో 17–17తో నిలిచాయి.
కానీ కిమ్‌షార్ప్‌విన్నర్లు సంధించి ఆధిక్యాన్ని 19–17కు పెంచుకున్నాడు. చిరాగ్స్మాష్లు కొట్టడంతో స్కోరు19–19తో సమమైంది. కానీ లెఫ్టాండర్ కిమ్‌క్రాస్‌కోర్టు విన్నర్లతో గేమ్‌ను ముగించాడు. 3–2తో రెండో గేమ్‌ను మొదలుపెట్టిన ఇండియా ప్లేయర్లు బ్రేక్‌వరకు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల ఆట లయ తప్పింది. బలమైన రిటర్న్స్ లేకపోవడంతో కొరియన్లు గేమ్‌తో పాటు మ్యాచ్ సొంతం చేసుకునారు.