ఊహించని కలెక్షన్స్తో.. మా ఊరి పొలిమేర 2

ఊహించని కలెక్షన్స్తో.. మా ఊరి పొలిమేర 2

సత్యం రాజేష్(Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల( Kamakshi Bhaskarla) జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఊరి పొలిమేర 2(Ma Oori Polimera 2). గౌరు గణబాబు సమర్పణలో గౌరి కృష్ణ నిర్మించారు. గెట‌‌ప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత‌‌, బాలాదిత్య, ర‌‌వి వ‌‌ర్మ, చిత్రం శ్రీను నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. 

గీతా ఆర్ట్స్ 2 ప్రొడ్యూసర్ బన్నీ వాసు లాంటి పేరున్న నిర్మాత..ఈ సినిమాను  ఫ్యాన్సీ రేటు పెట్టి హక్కులు కొని రిలీజ్ చేశాడు. పొలిమేర2 రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. దానికి తగ్గట్టుగానే సినిమా చూసిన ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

పొలిమేర2 ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే..ఏకంగా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. లో బడ్జెట్ గా తెరకెక్కి..ఇంతటి రెంజ్ వసూళ్లు వచ్చాయంటే..చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి.ఈ సినిమా వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు..కలెక్షన్స్ అమాంతం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

ఫస్ట్ డే టాక్ ఎలా ఉన్న..ఆ తర్వాత సెకండ్ డేకి వచ్చేసరికి టోటల్ పాజిటివ్ బజ్ రావడంతో..కలెక్షన్స్ రూ. 5.6 కోట్లు వరకు వచ్చాయని అంచనా. దీంతో ఈ స్థాయి కలెక్షన్స్ వస్తుండటంతో..మంచి సక్సెస్ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మూవీ కేవలం ఫస్ట్ డే నైజాంలోనే  కోటిన్నర కలెక్ట్ చేసింది. అంతేకాంకుండా ఈ వీకెండ్లో చాలా చోట్ల సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్లు పూర్తిగా జనాలతో కళకళలాడుతున్నాయి.ఇక మల్టీప్లెక్సుల్లో కూడా మంచి ఆక్యుపెన్సీలతో హాల్స్ నిండిపోతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ కూడా పెంచినట్టు సమాచారం. 

ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ స్థానంలో పొలిమేర 2 ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఎటువంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.