
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రేసింగ్ టీమ్‌ను కొన్నాడు. రేసింగ్ ఫెస్టివల్–24లో భాగంగా జరగనున్న పోటీల్లో దాదా టీమ్ ‘కోల్‌కతా రాయల్ టైగర్స్’ తొలిసారి బరిలోకి దిగనుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య జరిగే ఈ టోర్నీలో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్), ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ (ఎఫ్4ఐసీ) ఉండనున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కొచ్చి టీమ్స్ ఈ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాయి. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో కోల్‌కతా టీమ్‌తో బరిలోకి దిగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని దాదా పేర్కొన్నాడు. మోటార్ స్పోర్ట్స్‌పై తనకు ఆసక్తి ఎక్కువ అని చెప్పాడు. రేసింగ్ ఫెస్టివల్‌లోకి దాదాను స్వాగతిస్తున్నామని రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్స్ చైర్మన్, ఎండీ అఖిలేష్ రెడ్డి అన్నాడు.