కోహ్లీపై గంగూలీ ప్రశంసలు

కోహ్లీపై గంగూలీ ప్రశంసలు

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌పై సెంచరీతో తిరిగి ఫామ్‌‌‌‌ అందుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీపై బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఓ ప్లేయర్‌‌‌‌గా అతనిలో తనకంటే ఎక్కువ నైపుణ్యం ఉందని కితాబిచ్చాడు. ‘నైపుణ్యం పరంగా కోహ్లీ నన్ను మించినోడు. కెప్టెన్సీని మాత్రం పోల్చలేను. మేమిద్దరం భిన్నమైన కాలాల్లో చాలా ఎక్కువ క్రికెట్‌‌‌‌ ఆడాం. నా జనరేషన్‌‌‌‌లో నేను ఆడితే.. అతను ఇంకా ఆటలో కొనసాగుతున్నాడు.

బహుశా నా కంటే ఎక్కువ మ్యాచ్‌‌‌‌లే ఆడే చాన్స్‌‌‌‌ ఉంది. ఇప్పటికైతే నేనే ఎక్కువగా ఉన్నా.. రాబోయే రోజుల్లో కచ్చితంగా అధిగమిస్తాడు. విరాట్‌‌‌‌ అద్భుతమైన ప్లేయర్‌‌‌‌’ అని దాదా పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్‌‌‌‌లో లేనప్పుడు తాను ఎలాంటి సలహాలు ఇవ్వలేదన్నాడు. ప్రతి క్రికెటర్‌‌‌‌ మీడియా దృష్టిలో ఉంటారని, ఏం చేసినా తెలిసిపోతుందన్నాడు.

కెరీర్‌‌‌‌లో ఎదురయ్యే ఎత్తుపల్లాలను పాజిటివ్‌‌‌‌గా తీసుకోవాలన్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి, చెడు రోజులు ఉంటాయన్న దాదా.. ఒత్తిడికి లోనుకాకుండా వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని చెప్పాడు.