సీ లింక్ బ్రిడ్జికి సావర్కర్ పేరు మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం

సీ లింక్  బ్రిడ్జికి సావర్కర్  పేరు మహారాష్ట్ర కేబినెట్  నిర్ణయం

ముంబై: నిర్మాణంలో ఉన్న వెర్సోవా బాంద్రా సీ లింక్ బ్రిడ్జికి మహారాష్ట్ర సర్కారు వీర్  సావర్కర్  పేరు పెట్టనుంది. ఈ మేరకు సీఎం ఏక్ నాథ్  షిండే కేబినెట్  నిర్ణయించింది. గత నెల 28న సావర్కర్  జయంతి సందర్భంగా సీఎం షిండే ఈ ప్రకటన చేశారు. తాజా గా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ముంబై ట్రాన్స్  హార్బర్  లింక్ (ఎంటీహెచ్ఎల్) కూ మాజీ ప్రధాని వాజ్ పేయి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. 

ఎంటీహెచ్ఎల్ కు ‘అటల్  బిహారీ వాజ్ పేయీ స్మృతి హవా షేవా అటల్  సేతు’ గా నామకరణం చేస్తామని ఆయన తెలిపారు. ఆ  రెండు పేర్లనూ షిండే కేబినెట్  బుధవారం ఆమోదించింది. కాగా, 17 కిలోమీటర్ల వెర్సోవా బాంద్రా సీ లింక్..  అంధేరిని బాంద్రా వర్లీ సీ లింక్ తో కలుపుతుంది.