Iran Goalkeeper Stunning Saves: అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు మరో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెల్జియం జట్టుతో జరిగిన పోరులో ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరన్వాండ్ (Alireza Beiranvand) అద్భుతమైన రీతిలో డబుల్ సేవ్ చేసి జట్టుకు ఒక కీలకమైన పాయింట్‌ను అందించాడు. మ్యాచ్ 60వ నిమిషంలో బెల్జియం స్టార్ ప్లేయర్ మాక్సిమ్ డి కుయ్‌పర్ కొట్టిన రెండు బ్యాక్-టు-బ్యాక్ గోల్ షాట్లను కేవలం సెకన్ల వ్యవధిలో అడ్డుకుని ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ మూమెంట్‌ను క్రియేట్ చేశాడు.
సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతమైన సేవ్స్:
సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత బెల్జియం స్టార్ మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రూయిన్ ఇరాన్ డిఫెన్స్‌ని అప్పర హ్యాండ్ సాధించి, మాక్సిమ్ డి కుయ్‌పర్‌కు ఒక అద్భుతమైన పాస్ ఇచ్చాడు. డి కుయ్‌పర్ బాక్స్ లోపలి నుంచి కొట్టిన ఫస్ట్ షాట్ ఖచ్చితంగా గోల్ పడుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు.. కానీ 33 ఏళ్ల బెయిరన్వాండ్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ బంతిని అడ్డుకున్నాడు. అయితే రీబౌండ్ అయిన బంతి మళ్లీ డి కుయ్‌పర్ చేతికే చిక్కడంతో అతను రెండోసారి గోల్ కొట్టేందుకు ట్రై చేశాడు. ఆ క్షణంలో బెయిరన్వాండ్ క్షణాల వ్యవధిలో కోలుకుని, గాల్లోకి లేచి మరోసారి నమ్మశక్యం కానీ విధంగా బంతిని చేతులతో ఆపేశాడు. ఈ మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్‌తో బెల్జియం ప్లేయర్స్ తలలు పట్టుకోగా, స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా నిలబడి చప్పట్లు కొట్టారు.
టోర్నమెంట్‌కే హైలైట్‌గా నిలిచిన ఓవర్‌హెడ్ ఫోటో:
బెయిరన్వాండ్ తన గోల్ పోస్ట్ ముందు గాల్లో పూర్తిగా శరీరాన్ని చాచి, వేలికొనలతో బంతిని తాకుతున్న ఓవర్‌హెడ్ (Overhead) ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ 2026 వరల్డ్ కప్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మకమైన ఫోటోగా క్రీడా పండితులు అభివర్ణిస్తున్నారు. అతనిలోని పట్టుదల, అద్భుతమైన అథ్లెటిసిజానికి ఈ ఫోటో ఒక నిదర్శనంగా భావిస్తున్నారు.
ఇబ్బందులను అధిగమించి ఇరాన్ పోరాటం:
ఈ వరల్డ్ కప్‌లో ఇరాన్ జట్టు మైదానం వెలుపల అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యుఎస్ (U.S.) వీసా ప్రయాణ ఆంక్షలతో ఇరాన్ జట్టు మెక్సికోలోని టిజువానా (Tijuana) బేస్ క్యాంప్‌లో ఉంటోంది. దీంతో వారు ప్రతి మ్యాచ్‌కు అమెరికా వదిలి పెట్టాల్సి వస్తుంది. బెల్జియంతో మ్యాచ్‌కు ముందు కోలుకోవడానికి కూడా టైమ్ లేదని, కేవలం 16 గంటల ప్రిపరేషన్ టైమ్ మాత్రమే దొరికిందని ఇరాన్ కోచ్ అమీర్ ఘాలెనోయ్ వెల్లడించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బెయిరన్వాండ్ చూపించిన పర్ఫామెన్స్.. ఇరాన్ వర్సెస్ బెల్జియం మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Is this the save of the World Cup so far?
— Pulse & Passion (@AugustineO0z) June 22, 2026
How did Alireza Beiranvand keep this out? 😮
Belgium vs Iran #fifaworldcup pic.twitter.com/ODLRgYzQZD
🚨 Iran’s Alireza Beiranvand just earned FIFA Player of the Game for a historic masterclass against Belgium
— HUSSEIN (@PulseOrbit) June 21, 2026
Shut down one of the world’s best attacks like it was nothing. Team Iran cooking on the pitch while the resistance keeps winning everywhere else pic.twitter.com/C5tzA1mFW0
