టాలీవుడ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి(Priyadarshi), అభినవ్ గోమఠం(Abhinav Gomatam), చైతన్య కృష్ణ(Chaitanya krishna) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనింగ్ వెబ్‌సిరీస్ సేవ్ ది టైగర్స్ 2(Save the tigers 2). దర్శకుడు అరుణ్ కొత్తపల్లి(Arun KOttapalli) తెరకెక్కించిన ఈ సిరీస్ లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ హీరోయిన్స్ గా నటించారు. మరో హీరోయిన్ సీరత్ కపూర్ కీ రోల్ చేసిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మహి వీ రాఘవ్ నిర్మించారు.
సీజన్ 1 మంచి విజయం సాధించిన క్రమంలో సీజన్ 2పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మంచి అంచనాల మధ్య ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. విడుదలైన తక్కువ సమయంలో రికార్డ్ వ్యూస్ సాధించింది ఈ సిరీస్. తాజాగా ఇండియా వైడ్ గా మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సిరీస్. డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతోన్న ఈ వెబ్ సిరీస్ దేశంలోనే టాప్ 3లో నిలిచింది. ఓటీటీలోనే దేశవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సిరీస్‌ల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో సేవ్ ది టైగెర్స్ సిరీస్ టీమ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఈ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు మహి వి.రాఘవ్ స్పందిస్తూ.. మా సేవ్ ది టైగెర్స్ వెబ్ సిరీస్ అరుదైన రికార్డ్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఒక సిరీస్ కు సంబందించిన రెండు సీజన్లు ఇంత భారీ విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. మంచి కంటెంట్ తో వస్తే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు... అంటూ చెప్పుకొచ్చాడు.