సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివి..పీయూ వీసీ శ్రీనివాస్, ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత

సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివి..పీయూ వీసీ శ్రీనివాస్, ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహిళా అభ్యున్నతికి సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు మరువలేవని పాలమూరు యూనివర్సిటీ వీసీ  శ్రీనివాస్ కొనియాడారు.  సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం వర్సిటీలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ సివిల్ సర్వీసెస్ పరీక్షలు– రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధత’ అంశంపై విద్యార్థులకు అవగాహ కల్పించారు. ఈ సందర్భంగా వీసీ  మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలేను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని సూచించారు. 

హైదరాబాద్ లోని ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత మాట్లాడుతూ పాలమూరు వర్సిటీలో 70 శాతం విద్యార్థినులు చదువుకుంటున్నదుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  విద్యార్థులు తమ కలలను సహకారం చేసుకోవాలంటే ప్రతిరోజు 15 గంటలు కష్టపడి చదవాలని సూచించారు.

 సివిల్స్ కు ప్రిపేరయ్యే విద్యార్థులు న్యూస్ పేపర్ ప్రతిరోజు చదివి అందులోని ముఖ్యమైన వివరాలను నోట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు రాయాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ  పీజీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.కృష్ణయ్య, డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ ఎం. గాలన్న, డాక్టర్ ఎస్ఎన్ అర్జున్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.