మీ అకౌంట్స్‌‌కు ఇలా గుడ్ బై చెప్పండి

మీ అకౌంట్స్‌‌కు ఇలా గుడ్ బై చెప్పండి

ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి సోషల్ మీడియా అకౌంట్స్‌‌‌‌ని డిలీట్ చేయాలనుకుంటారు. తమ ప్రొఫైల్ ఎవరికీ కనిపించకుండా కంప్లీట్‌‌‌‌గా క్లోజ్  చేయాలనుకుంటారు.  దానికోసం కేవలం యాప్‌‌‌‌ని అన్‌‌‌‌ఇన్‌‌‌‌స్టాల్ చేస్తే సరిపోదు. యాప్‌‌‌‌తో పాటు అకౌంట్‌‌‌‌ని కూడా పూర్తిగా డీయాక్టివేట్ చేయాలి. కానీ అది అంత ఈజీగా దొరికే ఆప్షన్ కాదు. అందుకు కొంత అవగాహన అవసరం.

ఇంటర్నెట్‌‌‌‌లో ఎన్నో సోషల్ మీడియా సైట్లు, కమ్యూనికేషన్ , నెట్‌‌‌‌వర్క్ సైట్లు ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో వాటిలో అకౌంట్ క్రియేట్ చేసి అలా వదిలేస్తుంటాం. కానీ అలా చేయడం సెక్యూర్ కాదు అంటున్నారు టెక్ నిపుణులు.  అలా వాడకుండా ఉన్న అకౌంట్లను పూర్తిగా డియాక్టివేట్ చేయడమే మంచిదంటున్నారు.

గూగుల్

ప్రతి ఒక్కరికీ రెండు మూడు గూగుల్  అకౌంట్లు ఉంటాయి. ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదో ఒక గూగుల్ అకౌంట్‌‌‌‌తో లింక్ చేసి ఉంటుంది. అయితే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో  గూగుల్ అకౌంట్‌‌‌‌ని డిలీట్‌‌‌‌ చేయాలనుకుంటే .. గూగుల్ అకౌంట్‌‌‌‌లోకి లాగిన్ అయి. ‘అకౌంట్‌‌‌‌ ప్రిఫరెన్సెస్‌‌‌‌’ లోకి వెళ్లాలి. అక్కడ  ‘డిలీట్‌‌‌‌ యువర్‌‌‌‌ అకౌంట్ అండ్ సర్వీసెస్‌‌‌‌’ అనే ఆప్షన్‌‌‌‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అకౌంట్‌‌‌‌ను పూర్తిగా డిలీట్ చేయొచ్చు. అయితే మీ జీ మెయిల్ ఐడీ, గూగుల్ ప్లస్ డేటా, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ అకౌంట్ ఇవన్నీ గూగుల్ అకౌంట్‌‌‌‌తో లింక్ అయి ఉంటాయి. అందుకే ఒక్క గూగుల్ అకౌంట్ డిలీట్ చేస్తే మిగతవన్నీ కూడా   డిలీట్ అయిపోతాయి. అయితే చాలామందికి జీ మెయిల్‌‌‌‌లో  ముఖ్యమైన డేటా ఉంటుంది.  అందుకే డిలీట్‌‌‌‌ చేసే ముందు డేటాని డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవడ౦  మర్చిపోవద్దు.

ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌

ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో అకౌంట్‌‌‌‌ని పూర్తిగా డిలీట్‌‌‌‌ చేయడమే కాకుండా కొంతకాలం తాత్కాలికంగా డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంది.  అకౌంట్‌‌‌‌ని కొంతకాలం పాటు పని చేయకుండా  డియాక్టివేట్‌‌‌‌ చేయాలంటే.. ముందు సెట్టింగ్స్‌‌‌‌లోకి వెళ్లాలి. సెట్టింగ్స్ పేజీలో  ‘మేనేజ్‌‌‌‌ అకౌంట్’ ఆప్షన్‌‌‌‌ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ‘డియాక్టివేట్‌‌‌‌ అకౌంట్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్‌‌‌‌ చేసి అకౌంట్‌‌‌‌ని కొంతకాలం నిలిపివేయొచ్చు.  అలా కాకుండా పూర్తిగా అకౌంట్‌‌‌‌ని తీసేయాలంటే.. సెట్టింగ్స్‌‌‌‌లోని ‘యువర్‌‌‌‌ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌’ ఆప్షన్‌‌‌‌ని క్లిక్‌‌‌‌ చేయాలి.  అక్కడ ‘డిలీట్‌‌‌‌ యువర్‌‌‌‌ అకౌంట్ అండ్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌’ ఆప్షన్‌‌‌‌ కనిపిస్తుంది. అది క్లిక్‌‌‌‌ చేసి శాశ్వతంగా డిలీట్‌‌‌‌ చేయొచ్చు. అవసరమైతే ఎందుకు డియాక్టివేట్ చేస్తున్నామో కారణం కూడా చెప్పొచ్చు.  అయితే ఇలా శాశ్వతంగా డిలీట్ చేసేముందు అకౌంట్‌‌‌‌లో ఉన్న  మొత్తం డేటాని డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకుంటే మంచిది.

ఇన్‌‌‌‌స్టా

ఫేస్‌‌‌‌బుక్ తర్వాత  అందరూ ఎక్కువగా వాడే యాప్ ఇన్‌‌‌‌స్టాగ్రామ్. ఇన్‌‌‌‌స్టా నుంచి పూర్తిగా బయటకు రావాలంటే… ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లాగా యాప్‌‌‌‌ నుంచి డియాక్టివేట్  చేయలేం. వెబ్‌‌‌‌ బ్రౌజర్‌‌‌‌లో లాగిన్‌‌‌‌ అయితేనే కుదురుతుంది.  బ్రౌజర్‌‌‌‌లో ఇన్‌‌‌‌స్టాగ్రామ్  వెబ్‌‌‌‌సైట్ ఓపెన్ చేసి  లాగిన్‌‌‌‌ అవ్వాలి. తర్వాత సెట్టింగ్స్‌‌‌‌లోకి వెళ్లి  ‘ఎడిట్‌‌‌‌ ఫ్రొఫైల్‌‌‌‌’ క్లిక్ చేయాలి.  అక్కడ  ఉన్న ఆప్షన్‌‌‌‌తో టెంపరరీగా అకౌంట్‌‌‌‌ని డిజేబుల్‌‌‌‌ చేయొచ్చు. శాశ్వతంగా తొలగించాలంటే..   ‘హెల్ప్‌‌‌‌ సెంటర్‌‌‌‌’లోకి వెళ్లాలి. దాంట్లో కనిపించే ‘డిలీట్‌‌‌‌ అకౌంట్’ ఆప్షన్‌‌‌‌తో శాశ్వతంగా డీయాక్టివేట్ చేయొచ్చు.  ఎందుకు డిలీట్‌‌‌‌ చేయాలనుకుంటున్నారో కారణం టైప్ చేసి  పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ని ఎంటర్‌‌‌‌ చేస్తే సరిపోతుంది. ఇందులో కూడా  ముందే డేటాని డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకుంటే బెటర్.

వాట్సాప్

ఇక ముఖ్యంగా వాట్సాప్. దీన్ని డిలీట్ చేయాలనుకునే వాళ్లు  తక్కువే. కానీ ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం చాలా సింపుల్. రెండు స్టెప్స్‌‌‌‌తో  యాప్‌‌‌‌ నుంచే  డీ యాక్టివేట్ చేయొచ్చు.  సెట్టింగ్స్‌‌‌‌లోకి వెళ్లి  ‘అకౌంట్’ని సెలెక్ట్‌‌‌‌ చేసి ‘డిలీట్‌‌‌‌ మై అకౌంట్’ క్లిక్ చేస్తే చాలు. అకౌంట్ డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేసే ముందు  మీ వాట్సాప్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌కి సంబంధించిన ఫొటోలు, గ్రూపు వివరాలు,  ఇతర సెట్టింగ్స్‌‌‌‌.. వీటన్నిటినీ  రిపోర్టు రూపంలో  మెయిల్ వస్తుంది. కాకపోతే మెయిల్ రావడానికి మూడు రోజులు పడుతుంది. మీ డేటా మీకు రాగానే అకౌంట్‌‌‌‌ని డిలీట్ చేసుకోవచ్చు.

ట్విటర్‌‌‌‌

ఇకపోతే  ట్విటర్‌‌‌‌‌‌‌‌లో మీరు చేసిన ట్వీట్లను, మీ అకౌంట్‌‌‌‌ని పూర్తిగా తీసేయాలనుకుంటే సింపుల్‌‌‌‌గా సెట్టింగ్స్‌‌‌‌లోకి వెళ్లండి. మెనూలోని ‘అకౌంట్’ని సెలెక్ట్‌‌‌‌ చేస్తే డియాక్టివేట్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌ కనిపిస్తుంది. క్లిక్‌‌‌‌ చేసి అకౌంట్  క్లోజ్ చేయొచ్చు.. అయితే చేసిన వెంటనే డిలీట్ అయిపోదు. ఓ నెలరోజుల పాటు అబ్జర్వేషన్‌‌‌‌లో ఉంటుంది. ఆ నెల రోజుల్లో ఎప్పుడైనా కావాలనుకుంటే తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డిలీట్‌‌‌‌ చేసే  ముందు ట్విటర్‌‌‌‌ డేటాని డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవాలి.

స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌

స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌ అకౌంట్  డిలీట్ చేయాలంటే  బ్రౌజర్‌‌‌‌లోకి లాగిన్ అవ్వాలి. సైట్‌‌‌‌ని ఓపెన్‌‌‌‌ చేశాక హోం పేజీలోని ‘సపోర్టు’లోకి వెళ్లాలి. అక్కడ   ‘మై అకౌంట్ అండ్‌‌‌‌ సెక్యూరిటీ’లోకి వెళ్లి ‘అకౌంట్ ఇన్ఫర్మేషన్‌‌‌‌’ని సెలెక్ట్‌‌‌‌ చేస్తే దాంట్లో ‘డిలీట్‌‌‌‌ మై అకౌంట్’ ఆప్షన్‌‌‌‌ కనిపిస్తుంది. లాగిన్‌‌‌‌ వివరాలు ఎంటర్‌‌‌‌ చేసి అకౌంట్‌‌‌‌ని తొలగించొచ్చు. 30 రోజుల వరకూ డిజేబుల్‌‌‌‌ మోడ్‌‌‌‌లోనే ఉంటుంది. ఈ లోపు మళ్లీ అకౌంట్ కావాలంటే యాక్టివేట్‌‌‌‌ చేసుకోవచ్చు. టైం అయిపోయాక అకౌంట్‌‌‌‌ తొలగిపోతుంది.

యాపిల్

యాపిల్ అకౌంట్‌‌‌‌ను  మిగతా అకౌంట్స్‌‌‌‌లా అంత  సులభంగా  డిలీట్ చేయలే౦. ఒకసారి యాపిల్ ఐడీ  క్రియేట్ అయ్యాక దాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే  యాపిల్ కస్టమర్ సపోర్ట్‌‌‌‌ని సంప్రదించాలి. కస్టమర్ సపోర్ట్ వాళ్లు కూడా కారణం ఎంతో బలమైంది అయితే తప్ప అంత ఈజీగా అకౌంట్ డిలీట్ చేయరు.   అయితే ఐడీని డిలీట్ చేయలేకపోయినా,  ఐడీతో లింక్ అయి ఉన్న డివైజెస్ నుంచి యాపిల్ అకౌంట్‌‌‌‌ను తొలగించొచ్చు.