V6 News

SBI భారీ డీల్: ఉద్యోగుల కోసం రూ.294 కోట్లతో 200 రెడీ ఫ్లాట్స్ కొనుగోలు..

SBI భారీ డీల్: ఉద్యోగుల కోసం రూ.294 కోట్లతో 200 రెడీ ఫ్లాట్స్ కొనుగోలు..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లోని తమ ఉద్యోగుల కోసం భారీ స్థాయిలో రెడీ-టు-మూవ్-ఇన్ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది.ఈ కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ఎస్‌బీఐ డెవలపర్‌ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా మొత్తం 200 రెడీ-టు-మూవ్-ఇన్ 2BHK అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయాలనేది బ్యాంక్ ప్లాన్.

ఎస్‌బీఐ ఈ యూనిట్లను నాలుగు ప్రధాన క్లస్టర్‌లలో కొనుగోలు చేయాలని చూస్తోంది. ప్రతి క్లస్టర్‌కు 50 యూనిట్ల చొప్పున మొత్తం 200 అపార్ట్‌మెంట్లు అవసరం స్టేట్ బ్యాంక్ సంస్థకు. సియోన్–ఘాట్‌కోపర్, అంధేరీ–బోరివలి, కోట్లుథానే–కళ్యాణ్ బెల్ట్, ఖర్‌ఘర్–పన్వేల్ ప్రాంతాల్లో 50 చొప్పున యూనిట్లకు వేరువేరు ధరలను నిర్ణయించింది బ్యాంక్.  ప్రతి అపార్ట్‌మెంట్ మహా RERA కార్పెట్ ఏరియా ప్రకారం 600 చదరపు అడుగులు ఉండాలి.

Also read:- షేక్‌అవుట్‌కు సిద్ధమౌతున్న క్విక్ కామర్స్.. వారికి మనుగడ కష్టమే

ఇక ఇతర నిబంధనలను పరిశీలిస్తే.. అపార్ట్‌మెంట్లు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవై ఉండాలి. అలాగే మహారాష్ట్ర RERA లో రిజిస్టర్ అయిన ప్రాజెక్టులు మాత్రమే బిడ్ చేయడానికి అర్హులని బ్యాంక్ వెల్లడించింది. తప్పనిసరిగా రెడీ-టు-మూవ్-ఇన్ స్థితిలో ఉండాలి, అవసరమైన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ముఖ్యంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే 200 కార్ పార్కింగ్, 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్‌తో సహా మొత్తం 400 పార్కింగ్ స్థలాలను కూడా బ్యాంక్ కొనుగోలు చేయాలని చూస్తోంది.

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలు ఉద్యోగుల వసతి కోసం బల్క్ కొనుగోళ్లు చేయడం సర్వసాధారణం. దీర్ఘకాలిక వ్యయ సామర్థ్యం, ఈజీ మెయింటెనెన్స్ కోసం చాలా కంపెనీలు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నాయని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు తమ సిబ్బంది కోసం సొంతంగా ఇళ్లను నిర్మించినప్పటికీ, ఇప్పుడు భూమి కొరత కారణంగా.. రెడీ-మేడ్ అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయని తేలింది. ఈ డీల్ మెుత్తం బడ్జెట్ రూ.294 కోట్లుగా బ్యాంక్ నిర్ణయించింది.