V6 News

19 నుంచి ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పో.. ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్

19 నుంచి ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పో..  ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్

బషీర్​బాగ్, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ ఎక్స్​పో 2025ను ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ తెలిపారు. హైటెక్స్ లో హల్ నంబర్ 4లో ఈ ప్రాపర్టీ షో తలపెట్టినట్లు వివరించారు. గురువారం కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఎక్స్​పోకు సంబంధించిన ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా మాదిరిగానే ఈసారి కూడా మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కళను సాకారం చేసేందుకు ఈ ఎక్స్​పోను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రైవేట్ బ్యాంక్ ల కంటే తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్ ను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామన్నారు.