కస్టమర్లకు SBI షాక్.. జులై 1 నుంచి కొత్త సర్వీస్ చార్జీలు

కస్టమర్లకు SBI షాక్.. జులై 1 నుంచి కొత్త సర్వీస్ చార్జీలు
  • క్యాష్ విత్ డ్రా నెలకు నాలుగుసార్లే ఉచితం
  • బ్యాంకు బ్రాంచీలో అయినా ఏటీఎం ద్వారా అయినా నాలుగుసార్లే ఉచితం 
  • అంతకు మించితే సర్వీస్ చార్జీతోపాటు జీఎస్టీ

దేశ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో బ్రాంచీలతో  భారీ సంఖ్యలో ఉన్న కస్టమర్లకు విస్తృతమైన సేవలు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చార్జీల బాదుడుకు సన్నాహాలు చేస్తోంది. సర్వీస్‌ చార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న స్టేట్ బ్యాంక్ జులై 1వ తేదీ నుంచి వివిధ సేవలకు సర్వీస్ చార్జీలను సవరించింది. క్యాష్ విత్ డ్రాయల్స్ నెలకు నాలుగుసార్లే ఉచితం. 
ఎస్‌బీఐ ఏటీఎం లేదా ఇతర ఏటీఎం నుంచి అయినా లేదా బ్యాంకు బ్రాంచీలలోనైనా నెలకు నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా క్యాష్ విత్‌డ్రా కు అవకాశం. ఆ తర్వాత విత్‌డ్రా చేస్తే ప్రతిసారీ రూ.15 సర్వీస్ చార్జీతోపాటు జీఎస్టీ కూడా పడుతుంది. 
ఒక ఆర్థిక సంవత్సరానికి పది చెక్కులు ఉన్న ఒక చెక్‌ బుక్‌ బ్యాంక్‌ ఉచితం.

అంతకు మించి మరో  చెక్‌ బుక్‌ కావాలంటే సర్వీసు చార్జీ రూ. 40తోపాటు జీఎస్టీ కూడా చెల్లించాలి (అందులో పది చెక్కులే ఉంటాయి).
ఎమర్జన్సీ చెక్‌ బుక్‌ కావాలంటే రూ. 50 సర్వీసు చార్జీతోపాటు జీఎస్టీ అదనం.
25 చెక్కులు ఉన్న చెక్‌బుక్‌ కావాలంటే సర్వీసు చార్జీ రూ.75తోపాటు  జీఎస్టీ అదనం.
కొత్త సర్వీస్ చార్జీల నుంచి  సీనియర్‌ సిటీజన్లకు మినహాయింపు ఇచ్చారు.